కరోనా నిబంధనలు అతిక్రమించిన మెలానియా ట్రంప్!
- చిన్న పిల్లల ఆసుపత్రిని సందర్శించిన మెలానియా
- మాస్కు తొలగించి కథలు చదివి వినిపించిన వైనం
- వివాదాస్పదం కావడంతో స్పందించిన ఆసుపత్రి వర్గాలు
వాషింగ్టన్‌లోని ఓ చిన్నారుల ఆసుపత్రిని సందర్శించిన అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కొవిడ్ నిబంధనలను అతిక్రమించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చిన్నారులకు కథలను చదివి వినిపించే క్రమంలో ఆమె మాస్కును తొలగించినట్టు చెబుతున్నారు.
చిల్డ్రన్స్ నేషనల్ ఆసుపత్రిని సందర్శించిన మెలానియా లోపలికి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించే కనిపించారు. అయితే, తన సీటులో కూర్చున్న తర్వాత దానిని తొలగించడం వివాదాస్పదమైంది. చిన్నారులను పలకరించిన మెలానియా అనంతరం వారికి కథలు చదివి వినిపించారు. ఈ క్రమంలో మాస్కును తొలగించారు.
కొవిడ్ నిబంధనల ప్రకారం ఆసుపత్రిలో ప్రతి ఒక్కరు మాస్కు ధరించాల్సిందే. వరండా సహా ప్రతి చోటా మాస్కు ధరించడం తప్పనిసరి. ఇతరులు ఎవరూ లేనప్పుడు మాత్రం మాస్కును తొలగించవచ్చు. మెలానియా మాస్క్ తొలగించడం వివాదాస్పదం కావడంతో ఆసుపత్రి వర్గాలు స్పందించాయి.
చిన్నారులకు కథలు చెప్పేందుకే ఆమె మాస్క్ తొలగించారని, ఆ సమయంలో ఆమె చిన్నారులకు 12 అడుగుల దూరంలో ఉన్నారని పేర్కొన్నాయి. మిగతా వారందరూ మాస్కు ధరించారని, పిల్లలకు కథలు చెప్పే సందర్భంలో తప్ప మిగతా సమయాల్లో మెలానియా మాస్కు ధరించే ఉన్నారని అధికారులు వివరించారు.