తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక.. కార్యనిర్వాహక కమిటీని ప్రకటించిన జనసేన

  • తిరుపతి ఉపఎన్నికలో బీజేపీతో కలిసి పని చేయనున్న జనసేన
  • క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేన
  • జనసేన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కమిటీ పని చేస్తుందని ప్రకటన
తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక నేపథ్యంలో ఏపీ రాష్ట్ర రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికలో బీజేపీ, జనసేన పార్టీలు కలసి పోటీ చేస్తున్నాయి. అయితే ఏ పార్టీ అభ్యర్థి బరిలో దిగుతారనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు కార్యనిర్వాహక కమిటీని జనసేనాని పవన్ కల్యాణ్ ఏర్పాటు చేశారు. క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, జనసేన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ కమిటీ పని చేస్తుందని జనసేన ఓ ప్రకటన ద్వారా తెలిపింది. పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న వారికి పార్టీలో స్థానం కల్పించామని వెల్లడించింది.

కార్యనిర్వాహక సభ్యులు వీరే:
డా. పి. హరిప్రసాద్
రాందాస్ చౌదరి
వినుత
ఉయ్యాల ప్రవీణ్
గూడూరు వెంకటేశ్వర్లు
మనుక్రాంత్ రెడ్డి
కిరణ్ రాయల్
పొన్న యుగంధర్
తీగల చంద్రశేఖర్
కంటేపల్లి ప్రసాద్


More Telugu News