హాస్యనటుడు అలీ నిర్మాతగా మొదలైన చిత్రం
- అలీ నేతృత్వంలో 'అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్'
- టైటిల్ 'అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి'
- తన రూమేట్ కిరణ్ కి దర్శకుడిగా ఛాన్స్
- ప్రధాన పాత్రలలో అలీ, సీనియర్ నటుడు నరేశ్
చిన్నప్పటి నుంచీ నటననే వృత్తిగా తీసుకుని.. వందలాది సినిమాలలో నటించిన అలీ కొన్ని సినిమాలలో హీరోగా కూడా నటించి మెప్పించాడు. హాస్యనటుడిగా తనదైన ముద్రవేసిన అలీ ఇప్పుడు నిర్మాతగా కూడా మారాడు. 'అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్' బ్యానర్ పై శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న 'అందరూ బాగుండాలి ..అందులో నేనుండాలి' చిత్రం షూటింగ్ ఈ రోజు హైదరాబాద్, అన్నపూర్ణ స్థూడియోలో ప్రారంభమైంది. ఇందులో అలీ, నరేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా అలీ చెబుతూ, 'చెన్నైలో వున్నప్పుడు దర్శకుడు కిరణ్, నేను ఒకే రూంలో ఉండేవాళ్లం. మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'వికృతి'కి ఇది రీమేక్. ఒక యథార్థ సంఘటన ఆధారంగా దీనిని మలయాళంలో నిర్మించారు' అని చెప్పారు.
ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు నరేశ్ చెబుతూ, 'అలీ నిర్మిస్తూ నటిస్తున్న ఈ చిత్రంలో నేను కూడా నటిస్తున్నందుకు హ్యాపీగా వుంది. మంచి కథ.. ఒరిజినల్ కి మార్పులు చేసుకుని దర్శకుడు మంచి స్క్రిప్ట్ తయారుచేసుకున్నాడు' అన్నారు. అలీ నెలకొల్పిన బ్యానర్లో తొలి సినిమాకి తాను దర్శకత్వం వహించడం ఆనందంగా ఉందని దర్శకుడు కిరణ్ చెప్పారు. ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని తెలిపారు.
కాగా, తొలిషాట్ కి ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి క్లాప్ కొట్టగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. దర్శకులు బోయపాటి శ్రీను, బాబీ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొని అలీకి విషెస్ చెప్పారు.