శ్రీరాముడు మా పార్టీ వాడే.. మేమంతా రామభక్తులం: అఖిలేశ్ యాదవ్
- అజమ్‌గఢ్ నుంచి లక్నోకు వెళ్లిన అఖిలేశ్
- అయోధ్యలో కొద్దిసేపు ఆగి కార్యకర్తలతో భేటీ
- తాము రాముడితో పాటు కృష్ణుడి భక్తులమని వ్యాఖ్య
- త్వరలో కుటుంబంతో కలిసి రామ జన్మభూమిని సందర్శిస్తామన్న అఖిలేశ్
శ్రీరాముడిపై సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామచంద్రుడు తమ పార్టీకి చెందిన వాడేనని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా, ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అజమ్‌గఢ్ నుంచి లక్నోకు వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి అయోధ్యలో కొద్దిసేపు ఆగారు.
ఆ ప్రాంతంలో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలతో ఆయన కొద్ది సేపు సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగానే రాముడు తమ పార్టీకి చెందిన వాడేనని, తాము రాముడితో పాటు కృష్ణుడి భక్తులమని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
తాము త్వరలో కుటుంబంతో కలిసి అయోధ్యలోని రామ జన్మభూమిని సందర్శిస్తామని చెప్పారు. శ్రీరాముడిని దర్శించుకుంటామని, తాము సరయూ నది ఒడ్డున లైటింగ్ తో పాటు భజన్ స్థల్ వద్ద సౌండ్ సిస్టమ్ వంటి అభివృద్ధి పనులను చేశామని గుర్తు చేశారు.