బీజేపీ చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన కొచ్చి కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి

  • కేరళలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలు
  • ఒక్క ఓటుతో ఎన్.వేణుగోపాల్ ఓటమి
  • ఓటింగ్ మిషన్‌లో ఏదో జరిగిందంటూ అనుమానాలు
  • కోర్టుకెళ్లే విషయంపై నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్య
ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుకు ఉన్న విలువ ఏంటో చాటిచెప్పే సంఘటన ఇది. కేరళలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల లెక్కింపు ఈ రోజు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఎన్.వేణుగోపాల్ కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు.

కొచ్చి కార్పొరేషన్ నార్త్ ఐలాండ్ వార్డు నుంచి పోటీ చేసిన వేణుగోపాల్ కు ఈ అనుభవం ఎదురైంది.  ఆయనపై బీజేపీ అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో గెలిచి విజయం సాధించారు. దీనిపై వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది కచ్చితంగా తాను గెలవాల్సిన సీటని ఆయన అన్నారు.

అయితే, కౌంటింగ్, ఓటింగ్ మిషన్‌లో ఏం జరిగిందో చెప్పలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. ఓటింగ్ మిషన్‌తోనే సమస్య అంతా అని ఆయన చెప్పారు. అందుకే బీజేపీ అభ్యర్థి తనపై విజయం సాధించి ఉండొచ్చని అన్నారు. దీనిపై న్యాయస్థానానికి వెళ్లే విషయంలో తాను ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అక్కడ ఏమి జరిగిందో తెలుసుకున్న అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు.


More Telugu News