వ్యాక్సిన్‌ను ఏపీలో క్రిస్మస్ నుంచి వేస్తారని మీ ఎంపీ చెబుతున్నారు.. నిజమా జగన్ గారు?: వర్ల రామయ్య
- మీ అవగాహనా రాహిత్యంతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారు
- ఏ వర్గ ప్రజలకు ప్రశాంతత లేకుండా చేశారు
- ఎంతో పేరున్న రాష్ట్రాన్ని అప్రదిష్ఠ పాల్జేశారు
- వ్యాక్సిన్ ప్రకటన కూడా రాజకీయమేనా?
డిసెంబరు 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే బృహత్ కార్యక్రమం ప్రారంభం కానుందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు 4,762 ఆరోగ్య కేంద్రాల్లో వాక్సినేషన్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆయన చేసిన ఈ ప్రకటనపై టీడీపీ నేత వర్ల రామయ్య అనుమానాలు వ్యక్తం చేశారు.
‘మీ అవగాహనా రాహిత్యంతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారు. ఏ వర్గ ప్రజలకు ప్రశాంతత లేకుండా చేశారు. ఎంతో పేరున్న రాష్ట్రాన్ని అప్రదిష్ఠ పాల్జేశారు. ఇప్పుడు, కరోనా టీకా క్రిస్మస్ పండుగరోజు వేస్తారని మీ ఎంపీ చెబుతున్నారు. నిజమా ముఖ్యమంత్రి గారు? ఇదీ రాజకీయమేనా?’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు.