'చచ్చిపో' అని చెప్పిన భర్త.. చెప్పినట్లుగానే నటి చిత్ర ఆత్మహత్య.. పోలీసుల విచారణలో వెల్లడి
- ఇటీవల హోటల్ గదిలో ఉరి వేసుకున్న చిత్ర
- భర్త హేమనాథ్ అరెస్టు
- ఇటీవల రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న జంట
- అనుమానాలు పెంచుకున్న హేమనాథ్
- హోటల్‌లో గొడవ.. ఆవేశంలో ఆత్మహత్య
తమిళ సినీ, టీవీ నటి చిత్ర ఇటీవల తానుంటోన్న హోటల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోన్న పోలీసులు ఆమె భర్త హేమనాథ్ ను విచారించారు. ఆయనను చిత్ర ప్రేమించి, ఇటీవల రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది.
ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులతో పాటు హోటల్ ఉద్యోగులను కూడా పోలీసులు ప్రశ్నించారు. చచ్చిపోవాలంటూ చిత్రను భర్త హేమనాథ్ ప్రేరేపించిన కారణంగానే ఆమె ఆ నిర్ణయం తీసుకుందని పోలీసులు తేల్చారు. విచారణలో మొదట హేమనాథ్ పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో పోలీసులు విచారణను పలు కోణాల్లో జరపగా కీలక విషయాలు తెలిశాయి.
కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కాలంలో రియల్ వ్యాపారి హేమనాథ్, చిత్ర ప్రేమలో పడ్డారు. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన అనంతరం ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం చిత్రపై హేమనాథ్‌కు అనుమానం ప్రారంభమైంది. అయినప్పటికీ హేమనాథ్ ఒత్తిడితో చిత్ర రిజిస్టర్ మ్యారేజ్‌కు అంగీకరించింది. చిత్ర షూటింగుల్లో బిజీగా ఉంటుండడం ఆయనకు నచ్చలేదు.
ఈ క్రమంలో ఓ రోజు అర్ధరాత్రి షూటింగ్ స్పాట్‌కు వచ్చి చిత్రను ఇంటికి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో వారిద్దరు కారులోనే గొడవపడ్డారు. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లారు. అక్కడ కూడా గొడవ పడగా, చచ్చిపొమ్మంటూ చిత్రకు హేమనాథ్ సలహా ఇచ్చాడు. దీంతో చిత్ర ఆవేశంలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ప్రస్తుతం హేమనాథ్ పొన్నేరి జైలులో రిమాండులో ఉన్నాడు.