ఆ గ్రీస్ నియంతలాగే జగన్ ప్రవర్తిస్తున్నారు: యనమల రామకృష్ణుడు
- గ్రీస్ నియంత డ్రాకోలా జగన్ అరాచక పాలన
- రాష్ట్ర ప్రజలను జగన్ ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు
- రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన స్వేచ్ఛను కాలరాస్తున్నారు
- ఆయన తీరు ప్రజాస్వామ్యానికి ముప్పు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను గ్రీస్ నియంత డ్రాకోతో పోల్చుతూ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. డ్రాకో పాలనలో కొనసాగించిన అరాచకాన్ని మించిన రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అమలు చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
రాష్ట్ర ప్రజలను జగన్ ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సిరాతో రాసే చట్టాలను రక్తంతో రాస్తూ ప్రజలను డ్రాకో హింసించేవారని యనమల చెప్పారు. అచ్చం అలాగే జగన్ ప్రవర్తిస్తూ భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన స్వేచ్ఛను కాలరాస్తూ పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని యనమల తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన సదుపాయాలను జగన్ తన కేసుల కోసం తాకట్టు పెట్టారని చెప్పారు. ఆయన తీరు ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆయన చెప్పారు. రాజకీయ నాయకులకు అధికారం దానంతట అదే రాదని, ప్రజలు ఇస్తేనే వస్తుందని అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టబోతున్న జో బైడెన్ చెప్పిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని యనమల తెలిపారు. కక్ష సాధింపు చర్యల కోసం అధికారాలను దుర్వినియోగం చేయకూడదని చెప్పారు.