కరోనా టెస్ట్ ధరను సగానికి తగ్గించిన ఏపీ!

  • రూ. 1000గా ఉన్న ధర రూ.499కి తగ్గింపు
  • తక్షణమే అమలులోకి కొత్త ధరలు
  • ఆదేశించిన ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి
ప్రస్తుతం రూ. 1000గా ఉన్న కరోనా పరీక్ష ధరను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.499కి తగ్గించింది. వీటీఎం, పీపీఈ కిట్ తో కలిపి ఈ ధరను నిర్ణయించామని, తగ్గించిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తన ఉత్తర్వుల్లో తెలిపారు. ఇకపై తమకు కరోనా ఉందన్న అనుమానం ఉన్నవారు పరీక్ష చేయించుకుంటే రూ. 499 మాత్రం చెల్లిస్తే సరిపోతుందని ఆయన అన్నారు.

ఐసీఎంఆర్ అనుమతి ఉన్న ల్యాబ్ ల్లో మాత్రమే ఈ పరీక్షలు చేయాలని అన్నారు. ఇక ప్రభుత్వం తరఫున ప్రైవేటు ల్యాబ్ లకు శాంపిల్ వెళితే రూ. 475కే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించారు. సవరించిన ధరల పట్టికను అన్ని హాస్పిటల్స్, ల్యాబ్ లు బహిరంగంగా ప్రదర్శించాలని, తగ్గించిన ధరల అమలు బాధ్యత జిల్లాల డీఎంహెచ్వోలదేనని ఆయన అన్నారు.

ఇదిలావుండగా, ఏపీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత గుమ్మిడి సంధ్యారాణికి కరోనా సోకింది. ఈ విషయాన్ని వెల్లడించిన ఆమె, తనతో పాటు ఇంట్లోని ఐదుగురికి వైరస్ సోకిందని, తామంతా ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నామని తెలిపారు.


More Telugu News