గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేయడంపై మండిపడిన అమెరికా

  • రైతుల ఉద్యమానికి మద్దతుగా వాషింగ్టన్‌లో సిక్కు వర్గాల ర్యాలీ
  • గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేసిన ఖలిస్థానీ వేర్పాటు వాదులు
  • ఇలాంటి దుశ్చర్యలను సహించబోమన్న అమెరికా
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఉద్యమానికి సంఘీభావంగా అమెరికాలో సిక్కువర్గాలు ఇటీవల ర్యాలీ నిర్వహించాయి. అయితే, ఈ ర్యాలీలోకి ప్రవేశించిన ఖలిస్థానీ వేర్పాటు వాదులు వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎదుట ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేశారు.

ఈ ఘటనపై తాజాగా అమెరికా స్పందించింది. దీనిని తీవ్రంగా ఖండించిన శ్వేతసౌధం.. విగ్రహాన్ని అపవిత్రం చేయడాన్ని ఘోరమైన చర్యగా అభివర్ణించింది. గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేయడాన్ని భయంకరమైన చర్యగా అభివర్ణించిన వైట్‌హౌస్ ప్రతినిధి కేలీ మెకనీ.. ఇలాంటి దుశ్చర్యలను సహించబోమని హెచ్చరించారు. శాంతి, అహింస, స్వేచ్ఛ వంటి అమెరికా విలువలకు మరింత గౌరవం తీసుకొచ్చిన గాంధీ ప్రతిష్ఠను అమెరికాలో మరింత గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.


More Telugu News