వింత వ్యాధి నుంచి బయటపడిన ఏలూరు!
- మూడు రోజులుగా నమోదు కాని కొత్త కేసులు
- నేడు అధికారులతో జగన్ వీడియో కాన్ఫెరెన్స్
- వ్యాధి కారణాలపై నివేదిక ఇవ్వనున్న అధికారులు
దాదాపు పది రోజుల పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంత ప్రజలను గడగడలాడించిన వింత వ్యాధి దాదాపుగా మాయమైంది. గడచిన మూడు రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఈ వింత వ్యాధి నుంచి ఏలూరు బయటపడిందని ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
నేడు మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్, ఏలూరు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇదే సమయంలో ఈ వ్యాధి సోకడానికి గల కారణాలపై ఉన్నతాధికారుల నివేదిక కూడా ప్రభుత్వానికి అందుతుంది. ఆపై వ్యాధి కారణాలను వివరించనున్న ప్రభుత్వం, ఏలూరు విముక్తమైందని ప్రకటిస్తుందని తెలుస్తోంది.
కాగా, కలుషిత నీరు తాగడం వల్లే ఈ వ్యాధి సంభవించిందని, రక్తంలో పరిమాణానికి మించి లోహాలు చేరడమే ప్రజలను అస్వస్థతకు గురి చేసినట్టు నివేదికలు సిద్ధమైనట్టు సమాచారం.