టామ్ మూడీని తిరిగి పిలిపించిన హైదరాబాద్ సన్ రైజర్స్!
- గతంలో హైదరాబాద్ కు ఎన్నో విజయాలు అందించిన టామ్ మూడీ
- జట్టుకు డైరెక్టర్ గా నియమిస్తున్నట్టు తాజా ప్రకటన
- హర్షం వ్యక్తం చేస్తున్న అభిమానులు
ఐపీఎల్ పోటీల్లో హైదరాబాద్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మరోసారి జట్టులోకి వచ్చారు. టామ్ మూడీని సన్ రైజర్స్ కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గా నియమిస్తున్నట్టు జట్టు మేనేజ్ మెంట్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. కాగా, మూడీ కోచ్ గా ఉన్న 2013 నుంచి 2019 మధ్య ఏడు సార్లు ప్లే ఆఫ్ కు వెళ్లిన హైదరాబాద్ జట్టు, 2016లో విజేతగా, 2018లో రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
2020లో మూడీ స్థానంలో బెయిలిస్ ను కోచ్ గా నియమించింది. బెయిలిస్ కోచింగ్ లో గడచిన 13వ సీజన్ తొలి దశలో కొంత వెనుకబడినా, ఆపై వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ వరకూ వెళ్లి, ఢిల్లీతో జరిగిన క్వాలిఫయర్-2లో ఓడిపోయింది. ఇక వచ్చే సీజన్ లో విజయమే లక్ష్యంగా ప్లాన్లు వేస్తున్న సన్ రైజర్స్ కీలకమైన టామ్ మూడీని తిరిగి పిలిపించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.