వరవరరావు కోలుకున్నారు.. జైలుకు తరలించొచ్చు: ఎన్ఐఏ
- ఏడాదిన్నర విచారణ ఖైదీగా వరవరరావు
- అనారోగ్యంతో నానావతి ఆసుపత్రిలో చికిత్స
- తిరిగి జైలుకు తరలించాలన్న ప్రతిపాదనను తిరస్కరించిన కోర్టు
- సోమవారం బెయిలు పిటిషన్‌ను విచారిస్తామన్న ధర్మాసనం
ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విప్లవకవి వరవరరావు ఆరోగ్యం మెరుగుపడిందని, ఆయనను ఇక ఆసుపత్రి నుంచి తలోజా జైలుకు తరలించవచ్చని బాంబే హైకోర్టుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపింది. చికిత్సతో ఆయన కోలుకున్నారని, జైలుకు తరలించాల్సిన సమయం వచ్చిందని దర్యాప్తు సంస్థ తరపు న్యాయవాది, అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ కోర్టుకు తెలిపారు.
అయితే, ఇందుకు జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎంఎన్ కార్నిక్‌లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. వరవరరావుకు బెయిలు ఇప్పించాల్సిందిగా కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు ఇందిరా జైసింగ్, ఆనంద్ గ్రోవర్‌లు దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై సోమవారం విచారణ జరుగుతుందని, అప్పటి వరకు ఆయనను జైలులోనే ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది.
మావోయిస్టులతో కలిసి ప్రధాని హత్యకు కుట్ర పన్నారన్న అభియోగాలపై వరవరరావు అరెస్టయ్యారు. 80 ఏళ్ల ఆయన ఏడాదిన్నరగా జైలులోనే విచారణ ఖైదీగా ఉన్నారు. ఆగస్టు 2018లో వరవరరావుతోపాటు మరో నలుగురిని పూణె పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరెగావ్ అల్లర్లలో పాత్ర, మావోయిస్టులతో సంబంధాలు, మోదీ హత్యకు కుట్ర వంటి అభియోగాలు వీరిపై నమోదయ్యాయి.