ఎంఆర్ కాలేజి మైదానానికి తాళాలు... స్పందించిన సంచయిత

  • ఎంఆర్ కాలేజికి సంబంధించి మరో వివాదం
  • మైదానంలోకి అన్యులకు ప్రవేశం లేదన్న ప్రిన్సిపాల్
  •  స్థానికుల నుంచి వ్యతిరేకత
  • ప్రెస్ నోట్ చదవాలన్న సంచయిత
  • వాస్తవాలేంటో అందరికీ బోధపడతాయని వివరణ
విజయనగరం మహారాజా కళాశాల క్రీడా మైదానానికి తాళాలు వేసిన ఘటన వివాదం రేకెత్తించింది. విద్యార్థులకు, కాలేజి సిబ్బందికి తప్ప ఇతరులకు మైదానంలో ప్రవేశంలేదని ఎంఆర్ కాలేజి ప్రిన్సిపాల్ నోటీసుల ద్వారా తెలిపారు. దీనిపై ఆ పరిసర ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నో ఏళ్లుగా ఈ మైదానంలో వాకింగ్ చేస్తున్నామని, ఇప్పుడు తాళాలు వేయడం ఏంటని అంటున్నారు.

ఈ వ్యవహారంపై మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత గజపతి స్పందించారు. అసత్యపు వార్తలు ప్రచారం చేయడానికి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఓవర్ టైమ్ పనిచేస్తోందని విమర్శించారు. దయచేసి ఎంఆర్ కాలేజి ప్రిన్సిపాల్ జారీ చేసిన ప్రకటన చదవాలని సూచించారు. ఇది చదివితే వాస్తవాలు ఏంటో అందరికీ బోధపడతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, కాలేజి ప్రిన్సిపాల్ జారీ చేసిన పత్రికా ప్రకటన కాపీని ఆమె ట్విట్టర్ లో పంచుకున్నారు.


More Telugu News