జగన్ వైఫల్యాలకు మారుపేరులా నిలిచారు: కేశినేని శ్వేత

  • మూడు రాజధానుల  నిర్ణయం మూర్ఖత్వంతో తీసుకున్నది
  • రైతుల కోసం విజయవాడ యువకులు సైన్యంగా వచ్చారు
  • ఈ సైన్యం సునామీలా మారితే జగన్ తట్టుకోగలరా?
అమరావతి రైతులు ఏడాదిగా ఉద్యమం చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ ఏమాత్రం స్పందించడం లేదని టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేత విమర్శించారు. రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న శిబిరం ముందు నుంచే ముఖ్యమంత్రి ప్రతిరోజు వెళ్తున్నారని.. అయినా, ఒక్క రోజు కూడా ఆయన రైతులతో మాట్లాడింది లేదని చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ మూర్ఖత్వంతో తీసుకున్నారని అన్నారు. ఈరోజు ఆమె అమరావతి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.

అమరావతి కోసం విజయవాడ యువకులు ఒక సైన్యంగా ముందుకు వచ్చారని శ్వేత చెప్పారు. ఈ సైన్యం ఒక సునామీగా మారితే తట్టుకునే శక్తి ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. కరోనా కేసులు నమోదవుతున్న సమయంలో కూడా ప్రాణాలకు తెగించి రైతులకు మద్దతు పలికేందుకు తాము వచ్చామని చెప్పారు. ఇప్పటి వరకు గుప్పెడు ఇసుకను కూడా ప్రజలకు జగన్ ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. వైఫల్యాలకు మారుపేరులా నిలిచిన జగన్... మూడు రాజధానులను ఎలా నిర్మించగలరని అన్నారు.


More Telugu News