రైతులను విపక్షాలు పక్కదోవ పట్టిస్తున్నాయి: మోదీ

  • కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేందుకే
  • రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • రైతులకు అన్ని విధాలా అండగా ఉంటాం
తాము తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేందుకేనని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. గత కొన్నేళ్ల నుంచి రైతు సంఘాలు, ఇప్పుడున్న విపక్షాలు అడుగుతున్న వాటినే ఇప్పుడు తాము చట్టాల రూపంలో తీసుకొస్తామని చెప్పారు. రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు.

రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రైతులకు తాము అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. గుజరాత్ లో కచ్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తద్వారా వ్యవసాయ చట్టాల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదనే విషయాన్ని ఆయన స్పష్టం చేసినట్టైంది.

మరోవైపు, రైతు సంఘాల నాయకులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అమిత్ షా జరిపిన చర్చలు కూడా ఫలవంతం కాలేకపోయాయి. ఇంకోవైపు రైతులు తమ ఆందోళనలను తీవ్రతరం చేశారు. ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే కూడా రైతులకు తన మద్దతును ప్రకటించారు.


More Telugu News