ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • అంతర్జాతీయంగా లేని సానుకూలతలు
  • 10 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్, నిఫ్టీ
  • 5 శాతం వరకు లాభపడ్డ  బజాజ్ ఫైనాన్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడం... రిలయన్స్, టీసీఎస్ వంటి దిగ్గజాలు నష్టాలను చవిచూడటంతో మార్కెట్లు రెడ్ లో ట్రేడ్ అయ్యాయి. ఆ తర్వాత 11 గంటల సమయం నుంచి మళ్లీ పుంజుకోవడం ప్రారంభమైంది. చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 10 పాయింట్లు లాభపడి 46,263కి చేరుకుంది. నిఫ్టీ కూడా 10 పాయింట్లు పెరిగి 13,567 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (4.69%), బజాన్ ఫిన్ సర్వ్ (4.15%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.19%), టెక్ మహీంద్రా (2.08%), మారుతి సుజుకి (0.96%).

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-2.12%), నెస్లే ఇండియా (-2.11%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.51%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.33%), టీసీఎస్ (-1.26%).


More Telugu News