సీఎంను కలవకుండా పోలవరం నిర్వాసితులను పోలీసులు అడ్డుకున్నారు: మాజీ ఎంపీ హర్షకుమార్
- ఏపీలో నిరంకుశ పాలన సాగుతోందన్న హర్షకుమార్
- కాంగ్రెస్ తరఫున నిర్వాసితుల కోసం పోరాడతామని వెల్లడి
- దళితులపై దాడులు చేస్తున్న వారికి ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపణ
- దాడులపై కమిటీ వేయాలంటూ డిమాండ్
మాజీ ఎంపీ హర్షకుమార్ ఏపీ సర్కారుపై ధ్వజమెత్తారు. ఏపీలో నిరంకుశ పాలన కొనసాగుతోందని విమర్శించారు. సీఎంను కలవకుండా పోలవరం నిర్వాసితులను పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తరఫున పోలవరం నిర్వాసితుల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
దళితులపై దాడులు చేస్తున్నవారికి ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. చీరాలలో మాస్కు లేదని కిరణ్ కుమార్ ను పోలీసులు కొట్టి చంపారని, వారిపై కేసు లేదని అన్నారు. ఇలాంటివే అనేక రకాలుగా దళితులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. దళితులు, మైనారిటీలపై జరిగిన దాడులపై కమిటీ వేయాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.