దున్నపోతు ప్రభుత్వంలో చలనం రావడం లేదు: నారా లోకేశ్

  • రాష్ట్రంలో రోజుకో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు
  • కౌలు రైతులను కించపరిచేలా మంత్రులు మాట్లాడుతున్నారు
  • రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. రాష్ట్రంలో రోజుకో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నా... దున్నపోతు ప్రభుత్వంలో ఎలాంటి చలనం రావడం లేదని అన్నారు. మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు భరోసా ఇవ్వకపోగా... వారిని కించ పరిచేలా మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మోదుముడి గ్రామానికి చెందిన కౌలు రైతు ఓలేటి ఆదిశేషు అప్పుల భారంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాధాకరమని లోకేశ్ అన్నారు. తాడేపల్లి  ప్యాలస్ లో ఫిడేలు వాయించుకుంటున్న జగన్ గారు బయటకు వచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించాలని అన్నారు. ఖరీఫ్ సీజన్ లో నష్టపోయిన రైతులకు నస్టపరిహారం వెంటనే చెల్లించాలని ట్వీట్ చేశారు.


More Telugu News