కర్ణాటక శాసన మండలిలో తీవ్ర కలకలం.. ఛైర్మన్‌ను కుర్చీలోంచి లాగేసి తీసుకెళ్లిన కాంగ్రెస్ సభ్యులు.. వీడియో ఇదిగో
- శాసన మండలిలో సభ్యులు బాహాబాహీ
- ఏం జరుగుతోందో కూడా అర్థం కాని పరిస్థితి
- బీజేపీ, జేడీఎస్ కలిసి ఒకరిని ఛైర్మన్ స్థానంలో అక్రమంగా కూర్చోబెట్టారన్న కాంగ్రెస్ సభ్యులు
- ఛైర్మన్ తప్పుకోవాలంటోన్న కాంగ్రెస్ సభ్యులు
కర్ణాటక శాసనమండలిలో తీవ్ర కలకలం చెలరేగుతోంది. శాసన మండలిలోనే సభ్యులు బాహాబాహీకి దిగారు. అసలు శాసన మండలిలో ఏం జరుగుతోందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. బీజేపీ, జేడీఎస్‌లు కలిసి ఒకరిని ఛైర్మన్ స్థానంలో అక్రమంగా కూర్చోబెట్టారని కాంగ్రెస్ సభ్యులు మండిపడుతున్నారు.
ఇదే సమయంలో కొందరు గొడవపడడం కలకలం రేపుతోంది. కొందరు సభ్యులను మరికొందరు సభ్యులు బయటకు పంపిస్తున్నట్లు తెలిసింది. అంతేగాక, శాసన మండలి ఛైర్మన్ ను కుర్చీలోంచి లాగేసిన కాంగ్రెస్ సభ్యులు ఆయనను బయటకు పంపించారు.
సభ అదుపులో లేనప్పుడు ఛైర్మన్ తప్పుకోవాలంటూ కాంగ్రెస్ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. శాసన మండలిలో బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు లభ్యమైంది.