తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడకు కరోనా
- నిన్నటి పరీక్షల్లో వైరస్ సోకినట్టు నిర్ధారణ
- హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిన మంత్రి
- తనను కలిసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని సూచన
తెలంగాణలో కరోనా మహమ్మారి బారినపడుతున్న మంత్రుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు కరోనాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరి కోలుకున్నారు. తాజాగా, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు కూడా కరోనా సంక్రమించింది. నిన్న ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.
దీంతో ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తనకు కరోనా సోకిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మంత్రి.. ఇటీవల తనను కలిసిన ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. కరోనా నుంచి కోలుకుని మళ్లీ యథావిధిగా కార్యక్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు.