సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'ఆహా' కోసం అమల పాల్ వెబ్ సీరీస్
- షూటింగ్ పూర్తిచేసిన అలియా భట్
- చెస్ చాంపియన్ బయోపిక్ లో ధనుష్
* కథానాయిక అమల పాల్ అటు సినిమాలు చేస్తూనే, మరోపక్క వెబ్ సీరీస్ కూడా చేస్తోంది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కోసం 'లస్ట్ స్టోరీస్' తెలుగు రీమేక్ సీరీస్ లో నటిస్తున్న ఈ భామ.. తాజాగా 'ఆహా' కోసం మరో సీరీస్ ఒప్పుకుంది. ఎనిమిది ఎపిసోడ్స్ గా రూపొందే ఈ సీరీస్ కి కన్నడ దర్శకుడు పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తాడు.
* బాలీవుడ్ భామ అలియా భట్ వారం రోజుల క్రితం 'ఆర్ఆర్ఆర్' చిత్రం షూటింగులో జాయిన్ అయిన సంగతి విదితమే. నిన్న ఆమె తన షూటింగును ముగించుకుని ముంబైకి వెళ్లిపోయింది. చరణ్, అలియా కాంబోలో ఈ వారం రోజుల్లోనూ పలు కీలక సన్నివేశాలను రాజమౌళి చిత్రీకరించారు.
* భారత్ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ జీవితకథను వెండితెర బయోపిక్ గా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో తమిళ నటుడు ధనుష్ కథానాయకుడుగా నటిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.