నిరసనల వేళ రహదారులపై క్రికెట్ ఆడిన రైతన్నలు!
- వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు
- ఇవాళ నిరాహార దీక్ష చేపట్టిన రైతులు
- దీక్షలో పాల్గొన్న 32 సంఘాల నేతలు
- రోడ్లనే మైదానాలుగా భావించి క్రికెట్ ఆడిన రైతులు
- నెట్టింట సందడి చేస్తున్న ఫొటోలు, వీడియోలు
జాతీయస్థాయిలో తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దులో గత కొన్నివారాలుగా నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్రంతో పలు దఫాలుగా చర్చలు జరిపినా సమస్య ఓ కొలిక్కి రాకపోవడంతో ఇవాళ ఒక్కరోజు దీక్షలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైతులు రోడ్లపై క్రికెట్ ఆడుతూ దర్శనమిచ్చారు.
రైతుల నిరసనలకు నేడు 19వ రోజు కాగా, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో 32 రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. కాగా, పలు చోట్ల రైతులు క్రికెట్ ఆడారు. ఢిల్లీ-హర్యానా హైవే పైనా, ఘాజీపూర్ బోర్డర్ వద్ద ఉల్లాసంగా క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.