దాసోజు శ్రవణ్ ఇంట విషాదం... తీవ్ర విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

  • దాసోజు శ్రవణ్ తండ్రి కృష్ణమాచారి కన్నుమూత
  • కరోనా బారినపడి మృతిచెందిన వైనం
  • ఎంతో బాధపడ్డానన్న పవన్ 
  • శ్రవణ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
  • శ్రవణ్ తల్లి త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తండ్రి దాసోజు కృష్ణమాచారి కన్నుమూశారు. ఆయన కరోనా వైరస్ బారినపడి తుదిశ్వాస విడిచారు. శ్రవణ్ తల్లికి కూడా కరోనా సోకగా, ఆమె చికిత్స పొందుతున్నారు. కాగా, దాసోజు శ్రవణ్ పితృవియోగానికి గురికావడం పట్ల జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

మిత్రుడు దాసోజు శ్రవణ్ తండ్రి దాసోజు కృష్ణమాచారి ఇక లేరని తెలిసి ఎంతో బాధపడ్డానని వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, సద్గతులు ప్రాప్తించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ కష్ట సమయంలో శ్రవణ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రవణ్ తల్లి జోగమ్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.


More Telugu News