యంగ్ హీరోతో మహేశ్ బాబు నిర్మిస్తున్న చిత్రం

  • ఇతర హీరోలతో మహేశ్ చిత్రనిర్మాణం 
  • అడివి శేష్ తో నిర్మాణంలో 'మేజర్'  
  • నవీన్ పోలిశెట్టితో మరొకటి ప్లానింగ్
  • చర్చల దశలో వున్న ప్రాజక్టు
మహేశ్ బాబు ఓపక్క సినిమాలలో నటిస్తూనే మరోపక్క మల్టీప్లెక్స్ నిర్వహణ .. ఇంకోపక్క సినిమా నిర్మాణం కూడా చేస్తూ వ్యాపారంపై కూడా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన యంగ్ హీరో అడివి శేష్ హీరోగా 'మేజర్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకి చేరింది. వచ్చే ఏడాది ఇది విడుదల కానుంది.

ఇదిలావుంచితే, మరో బడ్జెట్ చిత్రాన్ని కూడా మహేశ్ తన జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి నటిస్తాడని తెలుస్తోంది. ఆమధ్య విడుదలైన 'ఏజంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' సినిమా ద్వారా నవీన్ ఆర్టిస్టుగా మంచి పేరుతెచ్చుకున్నాడు. అయితే, ప్రస్తుతం ఈ ప్రాజక్టు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం. దీనికి దర్శకుడు ఎవరన్నది ఇంకా వెల్లడికాలేదు.


More Telugu News