భక్తుడికి పోర్న్ వీడియో లింకు పంపిన వ్యవహారంలో ఐదుగురు ఉద్యోగులపై టీటీడీ వేటు
- 'శతమానం భవతి'కి సంబంధించి ఈమెయిల్ పంపిన భక్తుడు
- బదులుగా పోర్న్ లింకు పంపిన ఎస్వీబీసీ సిబ్బంది
- అధికారులకు ఫిర్యాదు చేసిన భక్తుడు
- వెంటనే విచారణకు ఆదేశించిన టీటీడీ చైర్మన్
- విధి నిర్వహణలో పోర్న్ వీడియోలు చూస్తున్నట్టు గుర్తింపు
- నలుగురికి షోకాజ్ నోటీసులు
నెలరోజుల కిందట ఓ కార్యక్రమానికి సంబంధించి భక్తుడు పంపిన ఈమెయిల్ కు స్పందిస్తూ ఎస్వీబీసీ సిబ్బంది పోర్న్ వీడియో లింకు పంపడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను టీటీడీ తీవ్రంగా పరిగణించింది. విజిలెన్స్ విభాగంతో విచారణ షురూ చేసింది. కారకులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ బృందాన్ని రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో, ఎస్వీబీసీ కార్యాలయానికి చెందిన ఐదుగురు ఉద్యోగులను టీటీడీ తొలగించింది. మరో నలుగురికి షోకాజ్ నోటీసులు పంపింది. పోర్న్ లింక్ పంపిన ఉద్యోగిని ఇప్పటికే తొలగించినట్టు తెలుస్తోంది.
ఈ ఐదుగురు కూడా ఎస్వీబీసీ కార్యాలయంలో విధులు నిర్వర్తించే సమయంలో పోర్న్ వీడియోలు చూస్తున్నట్టు సైబర్ క్రైమ్ బృందం గుర్తించింది.టీటీడీ వేటుకు గురైన వారిలో వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు ఉన్నారు. ఇక షోకాజ్ నోటీసులు అందుకున్నవారిలో చానెల్ మేనేజర్లు, జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు.
ఇటీవల ఓ భక్తుడు 'శతమానం భవతి' కార్యక్రమానికి సంబంధించి ఓ ఈమెయిల్ పంపాడు. అయితే, ఆ భక్తుడికి ఆధ్యాత్మిక అంశాల లింకు పంపాల్సిందిపోయి, ఎంతో నిర్లక్ష్యంగా పోర్న్ లింక్ పంపారు. దాంతో ఆ భక్తుడు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి,ఈవోకి ఫిర్యాదు చేశారు.