ఇక విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా: కమల్ నాథ్ సంచలన వ్యాఖ్యలు
- కావాల్సిన పదవులన్నింటినీ అనుభవించానన్న కమల్ నాథ్
- మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్న కమల్ నాథ్ వ్యాఖ్యలు
- కమల్ నాథ్ వ్యాఖ్యలను వక్రీకరించారన్న ఒక వర్గం
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు హింట్ ఇచ్చారు. తనకు విశ్రాంతి అవసరమని ఆయన చెప్పారు. తన రాజకీయ జీవితంలో కావాల్సిన పదవులన్నింటినీ అనుభవించానని అన్నారు. ఆయన వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ రాజకీయవర్గాల్లో కలకలం రేపాయి.
కమల్ నాథ్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. కేవలం పీసీసీ అధ్యక్ష పదవిని మాత్రమే ఆయన వదులుకుంటారని... రాజకీయాల్లో ఇకపై కూడా కొనసాగుతారని చెపుతున్నారు.
ఇటీవల మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందినప్పటి నుంచి కమల్ నాథ్ పై ఆయన వైరి వర్గాలు కోపంగా ఉన్నాయి. ఓడిపోతారని తెలిసిన అభ్యర్థులకు కూడా టికెట్లు ఇచ్చారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన భావిస్తున్నారని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.