కంగనా రనౌత్ పై హక్కుల ఉల్లంఘన నోటీసును ఫైల్ చేసిన శివసేన ఎమ్మెల్యే
- గత నెలలో ప్రతాప్ సర్నాయక్ స్థలాలలో సోదాలు నిర్వహించిన ఈడీ
- గత వారం సర్నాయక్ ను ప్రశ్నించిన అధికారులు
- సోదాల్లో పాకిస్థానీ క్రెడిట్ కార్డులు బయటపడ్డాయన్న కంగన
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ ప్రత్యేక హక్కుల ఉల్లంఘన నోటీసును ఫైల్ చేశారు. ఈడీ సోదాల్లో ప్రతాప్ సర్నాయక్ వద్ద పాకిస్థానీ క్రెడిట్ కార్డులు లభ్యమయ్యాయంటూ కంగన ట్వీట్ చేసిన నేపథ్యంలో, ఆయన ఈ నోటీసులను ఫైల్ చేశారు. కంగనపై చర్యలు తీసుకోవడానికి వీలుగా తన నోటీసును ప్రివిలేజ్ కమిటీకి పంపించాలని ప్రిన్సిపల్ సెక్రటరీని కోరారు.
మనీ లాండరింగ్ కేసులో సర్నాయక్ ను గత వారం ఈడీ విచారించింది. దాదాపు 6 గంటలకు పైగా ఆయనను విచారించింది. గత నెలలో ఆయనకు చెందిన స్థలాలలో సోదాలు నిర్వహించారు.
మరోవైపు కంగనపై ఇప్పటికే మహారాష్ట్ర శాసనమండలిలో ప్రివిలేజ్ మోషన్ ను మూవ్ చేశారు. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ గా అభివర్ణించినందుకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.