వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం

  • రిజిస్ట్రేషన్ల అంశంపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం
  • మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు
  • అభిప్రాయాలను సేకరించాలని ఆదేశాలు
  • అవినీతి రహిత విధానం రూపొందించాలని స్పష్టీకరణ
  • ప్రజలు లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండరాదని వ్యాఖ్యలు
తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల అంశంపై సీఎం కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇదే అంశంపై ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఇందులో కేబినెట్ మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు సభ్యులుగా ఉంటారు.

రిజిస్ట్రేషన్ల అంశంపై మంత్రివర్గ ఉపసంఘం నగరాలు, గ్రామాల్లో పర్యటించి అభిప్రాయ సేకరణ జరపాల్సి ఉంటుంది. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాలతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆపై సీఎంకు నివేదిక సమర్పిస్తారు.

ఓ మంచి విధానం తీసుకువచ్చేందుకు ఉపయోగపడేలా ఆ నివేదిక ఉండాలని సీఎం కేసీఆర్ అభిలషించారు. సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ప్రజలు లంచాలు ఇచ్చే పరిస్థితి లేకుండా, అవినీతి రహిత విధానానికి రూపకల్పన చేయాలని సూచించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు సరళంగా ఉండాలని అన్నారు.


More Telugu News