ఏపీ కరోనా అప్ డేట్: బాగా తగ్గిన యాక్టివ్ కేసుల సంఖ్య
- రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,966
- గడచిన 24 గంటల్లో 63,873 కరోనా టెస్టులు
- 506 మందికి పాజిటివ్
- అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 104 కేసులు
- అత్యల్పంగా కడప జిల్లాలో 12 కేసులు
ఏపీలో కరోనా వ్యాప్తిపై వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది. ప్రస్తుతం ఏపీలో 4,966 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 63,873 కరోనా పరీక్షలు నిర్వహించగా 506 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 104 కొత్త కేసులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో 69, పశ్చిమ గోదావరి జిల్లాలో 66, కృష్ణా జిల్లాలో 59 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కడప జిల్లాలో 12, విజయనగరం జిల్లాలో 13, అనంతపురం జిల్లాలో 17 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 613 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఐదుగురు మరణించారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 8,75,531 కరోనా కేసులు నమోదవగా 8,63,508 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య 7,057కి చేరింది.