'ముక్కు చీదుతున్న ముసలమ్మ'... ఇంటికి అదిరిపోయే ధర తెచ్చిపెట్టింది!
- ఇంటిని అమ్మకానికి ఉంచిన బ్రిటన్ మహిళ
- 3 లక్షల డాలర్ల మేర ధర నిర్ణయం
- ముందుకు రాని కొనుగోలు దారులు
- రాత్రికిరాత్రే ఇంటి గోడపై భారీ పెయింటింగ్
- జనాలను ఆకర్షించిన 'ముక్కు చీదుతున్న ముసలమ్మ' ఆర్ట్
- 17 రెట్లు పెరిగిపోయిన ఇంటి ధర
ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో వేల్ స్ట్రీట్ ఒకటి. ఐలిన్ మాకీన్ అనే మహిళ ఈ ప్రాంతంలో నివసిస్తోంది. అయితే, పలు కారణాల వల్ల తన ఇంటిని అమ్మకానికి ఉంచింది. ఇంటి ధరను 3 లక్షల డాలర్లుగా పేర్కొంది. అయితే, ఇంటిని కొనేందుకు పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. ఉన్నట్టుండి ఓ రోజు ఉదయం ఆమె ఇంటిని కొనేందుకు చాలామంది ఉత్సాహంగా ముందుకు వచ్చారు.
అందుకు కారణం.... ఆ ఇంటి గోడపై ఓ ముసలమ్మ ముక్కు చీదుతున్నట్టుగా ఉన్న పెయింటింగే. ఓ వీధి చిత్రకారుడు గీసిన ఆ పెయింటింగ్ ఇంటికి ఓ కళాకృతిని తీసుకువచ్చింది. తాను గీసిన పెయింటింగ్ ను ఇంటితో సహా ఆ కళాకారుడు సోషల్ మీడియాలో పోస్టు చేయగా విపరీతమైన స్పందన వచ్చింది. దాంతో ఆ ఇంటి ధర 17 రెట్లు పెరిగిపోయింది. ఇప్పుడా ఇంటిని 4 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తామంటున్నారట. దాంతో తమ ఇంటిని ఏ క్షణమైనా అమ్మేస్తామని ఇంటి యజమానురాలి కుమారుడు నికొలస్ తెలిపాడు.