రానున్న కొత్త మోటారు వాహనాల చట్టం వాహనదారుల నడ్డి విరగ్గొడుతుంది: వర్ల రామయ్య
- జనవరి ఒకటి నుంచి కొత్త మోటార్ వాహన చట్టం
- భారీగా పెరగనున్న జరిమానాలు
- జరిమానాలతో ప్రమాదాలు తగ్గించలేరన్న వర్ల రామయ్య
- మెరుగైన రోడ్ల నిర్వహణ అవసరమని వెల్లడి
- ట్రాఫిక్ పోలీసుల చిత్తశుద్ధి కూడా ముఖ్యమేనని హితవు
కొత్త సంవత్సరంలో కొత్త మోటార్ వాహన చట్టం అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. దీనిపై పత్రికల్లో వచ్చిన ఓ కథనం ఆధారంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ట్విట్టర్ లో స్పందించారు. రానున్న కొత్త మోటార్ వాహన చట్టం వాహనదారుల నడ్డి విరగ్గొడుతుందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం రూ.100గా ఉన్న జరిమానా కొత్త చట్టం వస్తే రూ.1000 అవుతుందని వెల్లడించారు. జరిమానాలతో రోడ్డుప్రమాదాలు నివారించలేరని స్పష్టం చేశారు. "రోడ్ల నిర్వహణ, ట్రాఫిక్ పోలీసులు చిత్తశుద్ధితో విధి నిర్వహణ చేసినప్పుడే ప్రమాదాలు తగ్గుతాయి.... సినిమాలు వేరు సార్" అంటూ హితవు పలికారు.
కాగా, కొత్త వాహన చట్టంలో జరిమానాలను భారీగా పెంచారు. హెల్మెట్ లేకపోతే రూ.1,035, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, మైనర్లకు వాహనం ఇవ్వడం, రేసింగ్ వంటి తప్పిదాలకు రూ.5,035, వేగంగా నడిపినా, సిగ్నల్ ఉల్లంఘనలకు పాల్పడినా రూ.1,035 జరిమానా వడ్డిస్తారు.