పోలవరం ప్రాజెక్టు-అంచనాలు-మతలబులు ఇవే: ఐవైఆర్ వ్యాఖ్యలు

  • భూసేకరణ, పునరావాసానికి 2014 అంచనా 12 వేల కోట్ల రూపాయలు
  • 2017లో ఇది 28 వేల కోట్లు అయింది
  • ప్రాజెక్టు ఎత్తు అప్పుడు, ఇప్పుడు ఒకటే
  • కాబట్టి ముంపు స్థలం పెరిగే అవకాశం లేదు
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగడం గురించి ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తన అభిప్రాయాలను తెలిపారు. ‘పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసానికి 2014 అంచనా 12 వేల కోట్ల రూపాయలు. 2017లో ఇది 28 వేల కోట్లు అయింది. ప్రాజెక్టు ఎత్తు అప్పుడు ఇప్పుడు ఒకటే కాబట్టి ముంపు స్థలం పెరిగే అవకాశం లేదు. భూసేకరణ చట్ట సవరణ 2014 ముందు అయింది. దాని ప్రభావం ఉండే అవకాశం లేదు’ అని తెలిపారు.
 
‘భూముల ధరలు పెరిగే  అవకాశము లేదు. ఇదంతా గిరిజన ప్రాంతం. మరి ఇంత అమాంతంగా అంచనాలు పెరగడానికి కారణం ఏంటి అనే అనుమానం ఎవరికైనా రావచ్చు. ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ వారు, అధికార పార్టీ అస్మదీయులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని పరిహారం ఖర్చులను అమాంతం పెంచేశారు అని ఆరోపించారు’ అని ఐవైఆర్ చెప్పారు.
 
‘ఇప్పుడు ఆ ఆరోపణలపై వారే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ అంశం తేలేంతవరకూ ముంపు ప్రాంతాల భూసేకరణ సజావుగా సాగే అవకాశం లేదు. కేంద్రాన్ని నిందించి లాభం లేదు’ అని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు.


More Telugu News