అందుకే ఏలూరులో వింత వ్యాధి వ్యాపించింది: చినరాజప్ప
- వైసీపీ సర్కారే కారణం
- ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోలేదు
- ప్రజలకు సురక్షితమైన మంచి నీరు ఇవ్వలేకపోతున్నారు
- ఈ వ్యాధి రావడానికి తాగునీరే కారణం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత చినరాజప్ప విమర్శలు గుప్పించారు. ఇటీవల ఏలూరులో వింత వ్యాధి వ్యాప్తి చెంది వందలాది మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీనికి వైసీపీ సర్కారే కారణమని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే ఆ వ్యాధి అంతగా ప్రబలకపోయేదని చెప్పారు.
కనీసం ప్రజలకు సురక్షితమైన మంచి నీరు ఇవ్వలేకపోతున్నారని, తమ పార్టీ తరఫున ఏలూరు వాసులకు మంచినీరు అందిస్తామని తెలిపారు. ఈ వ్యాధి రావడానికి తాగునీరే కారణమని తెలిపారు. టీడీపీ నేత లోకేశ్ అక్కడికి వెళ్లిన అనంతరమే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లారని ఆయన చెప్పారు.
ఆ ప్రాంతంలో జగన్ పర్యటించినప్పటికీ లాభం లేకుండా పోయిందని చెప్పారు. ఏలూరులో ఆ వింత వ్యాధి వచ్చి వారం అవుతున్నప్పటికీ ఇప్పటికీ పరిష్కారం లేదని తెలిపారు. ఏలూరు ఆసుపత్రిలో వారం రోజుల నుంచి బాధితులకు చికిత్స అందుతోందని ఆయన విమర్శలు గుప్పించారు.