వారు ఎన్ని చెప్పినా అది జరగని పని: ఆర్టికల్ 370పై కేంద్ర మంత్రి
- ఆర్టికల్ 370 ఇక ముగిసిన అధ్యాయం
- ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ మాటలు నమ్మొద్దు
- ఆ చట్టం మళ్లీ రాదు
ఆర్టికల్ 370 ఇక ముగిసిన అధ్యాయమని, దానిని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తేల్చి చెప్పారు. జమ్మూకశ్మీర్ నేతలు ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు ఈ విషయంలో ఎన్ని చెప్పినా అది జరగని పని అని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 అనేది మళ్లీ వచ్చే ప్రసక్తే లేదన్నారు.
ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడితే చైనా సాయం తీసుకుంటానని అంటారని, ముఫ్తీ పాకిస్థాన్ సాయం కోరుతారని విమర్శించారు. ఆర్టికల్ 370ని ఎలాగైనా పునరుద్ధరిస్తామని వారు చెబుతున్నప్పటికీ అవన్నీ కాని పనులని స్పష్టం చేశారు. ఈ చట్టం పని ఇక అయిపోయిందని, మళ్లీ దానిని తీసుకురావడం కుదరని పని అని అనురాగ్ పునరుద్ఘాటించారు.