రైతులను దేశద్రోహులతో పోల్చుతారా.. క్షమాపణలు చెప్పండి: సుఖ్‌బీర్ సింగ్ బాదల్
- కేంద్రం విధానాలకు తలొగ్గకుంటే దేశద్రోహులా?
- ఉన్నత పదవుల్లో ఉండీ ఇవేం వ్యాఖ్యలు
- రైతుల గోడు వినిపించుకోకుండా అణచివేయాలని చూస్తున్నారు
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులను ఖలిస్తాన్ తీవ్రవాదులుగా, దేశద్రోహులగా పోల్చడంపై శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొన్న బాదల్, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మంత్రులు వెంటనే రైతులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ విధానాలకు లోబడి ఉండని వారిని దేశద్రోహులుగా అధికారంలో ఉన్నవారు పోల్చడం దురదృష్టకరమైన విషయమన్నారు.
ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పిన బాదల్.. వారు వెంటనే రైతులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల గోడును వినడానికి ఇష్టపడని ప్రభుత్వం వారిని అణిచివేయాలని చూస్తుండడం దురదృష్టకరమని, కేంద్రం ఇంత దౌర్జన్యంగా ఎందుకు వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని బాదల్ పేర్కొన్నారు.