కేరళలో కరోనా వ్యాక్సిన్ ఉచితం: సీఎం పినరయి విజయన్ ప్రకటన

  • మరికొన్నివారాల్లో వ్యాక్సిన్ల రాక
  • ఎలాంటి డబ్బులు వసూలు చేయబోమన్న కేరళ సీఎం
  • అయితే వ్యాక్సిన్ లభ్యతపై ఆలోచించాలని వెల్లడి
  • వ్యాక్సిన్ వస్తే అందరికీ ఇస్తామని స్పష్టీకరణ
మానవాళిని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మరికొన్ని వారాల్లో వ్యాక్సిన్లు రంగప్రవేశం చేయనున్నాయి. ఇప్పటికే ఫైజర్, మోడెర్నా వంటి పలు ఫార్మా సంస్థల వ్యాక్సిన్లకు అనుమతులు లభించాయి. ఇప్పటికే చాలా దేశాలు కోట్లకొద్దీ డోసులు బుక్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్ ఆసక్తికర ప్రకటన చేశారు. కేరళలో కొవిడ్ వ్యాక్సిన్ ను ఉచితంగానే అందిస్తామని వెల్లడించారు.

"కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందో, లేదో అన్న విషయం ఆలోచించాలి. అయితే వ్యాక్సిన్ పై రుసుం వసూలు చేయాలని మాత్రం మే భావించడంలేదు" అని సీఎం విజయన్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ లభ్యమైతే రాష్ట్రంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని అన్నారు. తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News