లాటరీలో రూ.1140 కోట్లు గెలుచుకుని సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్న దంపతులు!
- లాటరీలో జాక్ పాట్ గెలుచుకున్న బ్రిటన్ దంపతులు
- ఆడంబరాలకు దూరంగా డబ్బును పంచేసిన వైనం
- 175 మందితో జాబితా
- గెలుచుకున్న దాంట్లో సగం డబ్బు వితరణ
- ఇతరుల కళ్లలో సంతోషమే ముఖ్యమని వ్యాఖ్యలు
- అభినందిస్తున్న నెటిజన్లు
ఒక కోటి రూపాయలు లాటరీలో గెలుచుకుంటేనే వామ్మో అంత డబ్బా అనుకుంటారు. అదే వెయ్యి కోట్ల రూపాయల పైనే గెలుచుకుంటే ఇంకేమనాలి? బ్రిటన్ కు చెందిన పాట్రిక్, ఫ్రాన్సెస్ కనోలీ అనే దంపతులు 2019లో ఓ లాటరీలో జాక్ పాట్ గెలుచుకున్నారు. వారికి కళ్లు చెదిరే రీతిలో రూ.1140 కోట్ల ప్రైజు లభించింది. మామూలుగా అయితే ఇన్ని వందల కోట్లు గెలిస్తే ఎన్ని ఆడంబరాలకైనా అవకాశం ఉంటుంది.
పాట్రిక్, ఫ్రాన్సెస్ దంపతులు మాత్రం జీవితంలో సంపాదించలేనంత డబ్బు వచ్చినా ఎంతో నిరాడంబరంగా వ్యవహరించారు. సింపుల్ గా ఓ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నారు. అంతేకాదు, మొత్తం 175 మందితో ఓ జాబితా తయారుచేసి సగం డబ్బును వారికి పంచేశారు. ఆ జాబితాలో 50 మంది వారి బంధుమిత్రులు కాగా, మిగతా వాళ్లు పేదలు, అవసరంలో ఉన్నవాళ్లు.
తమకు సంపద కంటే ఇతరుల కళ్లలో సంతోషమే ముఖ్యమని పాట్రిక్, ఫ్రాన్సెస్ చెబుతున్నారు. ఈ దంపతుల దానగుణం ఇన్నాళ్లకు వెలుగులోకి వచ్చింది. ఈ సంగతి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు వీరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.