ప్రధాని మోదీతో భేటీ అయిన కేసీఆర్
- రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధానికి విన్నపం
- విభజన చట్టంలోని అంశాలపై చర్చ
- కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇవ్వాలని కోరిన సీఎం
ప్రధాని మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు అరగంట సేపు వీరి భేటీ కొనసాగింది. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను ఈ సందర్భంగా ప్రధానితో కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. విభజన చట్టంలోని పలు అంశాలు, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రధానంగా చర్చలు జరిపారని తెలుస్తోంది.
ఎఫ్ఆర్బీఎం పరిధి పెంపు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, జీఎస్టీ బకాయిలు వంటి వాటిపై ప్రధానితో చర్చించారు. వరదల వల్ల హైదరాబాదుకు కలిగిన నష్టానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కోరిన నిధులను అందించాలని విన్నవించారు.
మరోవైపు నిన్నటి నుంచి ఇప్పటి వరకు పలువురు కేంద్ర మంత్రులను కేసీఆర్ కలిశారు. వారిలో అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, హర్దీప్ సింగ్ పురి ఉన్నారు. ఢిల్లీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు.