లాలూ ప్రసాద్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది: డాక్టర్ ఉమేశ్ ప్రసాద్

  • ఆయన కిడ్నీలు 25 శాతం మేరకే పని చేస్తున్నాయి
  • పరిస్థితి ఎప్పుడైనా క్షీణించే అవకాశం ఉంది
  • వేరే చోట చికిత్స చేయించినా ఫలితం ఉండక పోవచ్చు
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన మూత్రపిండాలు కేవలం 25 శాతం మేరకే పని చేస్తున్నాయని చెప్పారు. పరిస్థితి ఎప్పుడైనా క్షీణించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ మేరకు ప్రస్తుతం లాలూ చికిత్స పొందుతున్న రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికారులకు డాక్టర్ ప్రసాద్ లిఖిత పూర్వకంగా తెలిపారు.

గత 20 ఏళ్లుగా లాలూ మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారని ప్రసాద్ చెప్పారు. ఆయన పరిస్థితి ఏ క్షణంలోనైనా విషమించే అవకాశం ఉందని రిమ్స్ కు తెలియజేశానని అన్నారు. చికిత్స కోసం ఆయనను ఎక్కడకూ తరలించాల్సిన అవసరం లేదనేది తన అభిప్రాయమని చెప్పారు. వ్యాధిని ఏ మందూ నయం చేయలేదని.. వేరోచోట చికిత్స చేయించినా ఫలితం ఉండక పోవచ్చని అన్నారు. మరోవైపు బెయిల్ మంజూరు చేయాలంటూ లాలూ తరపు న్యాయవాది వేసిన పిటిషన్ పై విచారణను ఝార్ఖండ్ హైకోర్టు జనవరి 22కి వాయిదా వేసింది.


More Telugu News