రిపబ్లిక్ డే పరేడ్ లో కనువిందు చేయనున్న అయోధ్య రామమందిర శకటం
- జనవరి 26న ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
- రామ మందిర శకటాన్ని రూపొందిస్తున్న ఉత్తరప్రదేశ్
- కేంద్రం ఆమోద ముద్ర వేసిందని ప్రకటన
జనవరి 26న ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అయోధ్య రామమందిర శకటం కనువిందు చేయనుంది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం నమూనాను ఈ శకటంపై రూపొందించనున్నారు. దీంతోపాటు దీపోత్సవాన్ని ప్రతిబింబించే నమూనాను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ శకటాన్ని రూపొందించనుంది. 'కల్చరల్ హెరిటేజ్ ఉత్తరప్రదేశ్' పేరుతో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ శకటాన్ని రూపొందించనున్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. తమ శకటానికి కేంద్రం ఆమోదముద్ర వేసిందని చెప్పింది.