పాకిస్థాన్ లోని బాలాకోట్ లో మళ్లీ యాక్టివ్ అయిన టెర్రర్ క్యాంపులు
- టెర్రర్ క్యాంపును యాక్టివేట్ చేసిన జైషే మొహమ్మద్
- యువతకు ఉగ్రవాద శిక్షణ
- అక్కడే ఉన్న మసూద్ అజార్ సోదరుడు రవూఫ్ అజార్
పాకిస్థాన్ లోని బాలాకోట్ పై గత ఏడాది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి బాలాకోట్ వార్తల్లోకి ఎక్కింది. బాలాకోట్ లో టెర్రర్ సంస్థ జైషే మొహమ్మద్ తన క్యాంపులను మళ్లీ యాక్టివ్ చేసింది. యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తోందని, భారత్ పై దాడులకు వీరిని తయారు చేస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భారత్ సర్జికల్ దాడులు చేసిన స్థలంలోనే ఇప్పుడు జైషే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
ఈ టెర్రర్ క్యాంపులకు సంబంధించి ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. భారత్ కు, హిందుత్వకు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నట్టుగా వీడియోలో ఉంది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం... మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఇక్కడి క్యాంపులోనే ఉన్నాడు. రవూఫ్ ను భారత్ కు వ్యతిరేకంగా నిర్వహించే ఆపరేషన్లకు హెడ్ గా మసూద్ అజార్ నియమించాడు. గత ఏడాది పుల్వామాలో సీఆర్ఫీఎఫ్ జవాన్లపై జరిగిన దాడి సూత్రధారి మసూద్ అజార్ అనే విషయం తెలిసిందే.