విదేశాలపై ఆధారపడకుండా వ్యాక్సిన్ అందించాలని కేంద్రం పట్టుదలగా ఉంది: కిషన్ రెడ్డి
- శాస్త్రవేత్తలకు మోదీ మనోధైర్యాన్ని ఇచ్చారు
- అందుకే ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించారు
- మోదీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు
సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో కరోనా సేఫ్ ఇంక్యుబేటర్, డయాలసిస్ సెంటర్లను ఈ రోజు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ల గురించి ఆయన మాట్లాడుతూ.. ఇతర దేశాలపై ఆధారపడకుండా మన దేశమే వ్యాక్సిన్ అందించాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా ఉందని తెలిపారు.
కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తలకు మనోధైర్యాన్ని ఇవ్వడానికే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటించారని అన్నారు. భారతీయులకు వ్యాక్సిన్ అందించడం కోసం మోదీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
అలాగే, పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు కేంద్రం కృషి చేస్తోందని, దేశంలో పేదల కోసం పెద్ద ఎత్తున జనరిక్ ఔషధ దుకాణాలను ఏర్పాటు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. కార్మికుల కోసం ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన వైద్య పరికరాలను తీసుకొచ్చామని తెలిపారు.