హైదరాబాదు శివారులో 'పుష్ప' షూటింగుకి ఏర్పాట్లు
- లారీ డ్రైవర్ 'పుష్ప'రాజ్ గా అల్లు అర్జున్
- ఇటీవల మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్
- కరోనా కారణంగా షూటింగ్ నిలుపుదల
- వ్యవసాయ క్షేత్రంలో షూటింగుకి ఏర్పాట్లు
అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్న చిత్రం 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కథ శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రను పోషిస్తున్నాడు. దాంతో సినిమాలో అతను చిత్తూరు యాసలో మాట్లాడుతుంటాడట. ఆ స్లాంగ్ లో బన్నీ పలికే డైలాగులు మాస్ ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెడతాయని అంటున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ ఆమధ్య తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో కొన్నాళ్ల పాటు జరిగింది. ఆ షెడ్యూలులో హీరో, విలన్ల గ్యాంగుపై ఓ యాక్షన్ ఎపిసోడ్, ఓ పాటను చిత్రీకరించారు. అయితే, మధ్యలో యూనిట్ లో కొందరికి కరోనా సోకడంతో షూటింగును అర్థాంతరంగా ఆపేసి, హైదరాబాదుకి తిరిగొచ్చేశారు. ఇప్పుడు కొవిడ్ నుంచి అందరూ కోలుకున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో తదుపరి షెడ్యూలు షూటింగును హైదరాబాదులో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నగర శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రాన్ని కథకి అనుగుణంగా మార్చుకుని, షూటింగు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. వచ్చే వారం నుంచి ఇక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. బన్నీ సరసన రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.