హైదరాబాదులో ఘనంగా నిహారిక, చైతన్య పెళ్లి రిసెప్షన్... వీడియో ఇదిగో!
- ఈ నెల 9న ఘనంగా నిహారిక, చైతన్యల వివాహం
- రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వేడుకగా జరిగిన పెళ్లి
- హాజరైన మెగా కుటుంబ సభ్యులు
- నేడు హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో విందు
- సందడి చేసిన చిరు, రామ్ చరణ్ తదితరులు
మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక, జొన్నలగడ్డ చైతన్యల వివాహం ఈ నెల 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వేడుకగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ శుభకార్యానికి మెగా కుటుంబాలన్నీ హాజరయ్యాయి. ఈ పెళ్లి రిసెప్షన్ కార్యక్రమాన్ని ఇవాళ హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈ విందు కార్యక్రమం నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది.
కాగా, ఈ రిసెప్షన్ కు వచ్చే అతిథులు లోపలికి ప్రవేశించాలంటే ఓ పాస్ వర్డ్ తప్పనిసరి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక, ఈ విందు కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తదితరులు విచ్చేశారు. అటు, చైతన్య తండ్రి, గుంటూరు రేంజి మాజీ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు వర్గం కూడా భారీగానే హాజరైనట్టు తెలుస్తోంది.