బీజేపీని బలహీనపరచాలని చూసి.. టీఆర్ఎస్ బొక్కబోర్లా పడింది: కిషన్ రెడ్డి

  • వరంగల్ తో నాకు అవినాభావ సంబంధం ఉంది
  • రజాకారులను తరిమికొట్టిన చరిత్ర వరంగల్ ది
  • వరంగల్ అభివృద్దికి చిత్తశుద్ధితో పని చేస్తా
వరంగల్ తో తనకు అవినాభావ సంబంధం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందడం, కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం, ఆ తర్వాత పార్లమెంటులో ఆర్టికల్ 370 వంటి కీలక బిల్లులు, అనంతరం కరోనా వైరస్ తదితర కారణాల వల్ల వరంగల్ కు రావడం ఆలస్యమైందని అన్నారు. రజాకారులను కూడా తరిమికొట్టిన చరిత్ర వరంగల్ దని చెప్పారు. ముమునూరు ఎయిర్ పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే... కేంద్ర ప్రభుత్వం నిర్మాణాన్ని పూర్తి చేస్తుందని అన్నారు.

కేంద్ర మంత్రిగా వరంగల్ అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. హడావుడిగా జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించి బీజేపీని బలహీనపరచాలని చూశారని.. అయినా, టీఆర్ఎస్ బొక్కబోర్లా పడిందని ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఓట్ల కోసం వరద బాధితులకు రూ. 10 వేల వంతున ఇచ్చినట్టే... వరంగల్ లోని బాధితులకు కూడా రూ. 10 వేల వంతున సాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు.


More Telugu News