కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అయిన కేసీఆర్
- గజేంద్ర సింగ్ షెకావత్ తో కేసీఆర్ భేటీ
- రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించనున్న సీఎం
- రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చించే అవకాశం
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, వాటికి కేంద్ర సహాయం వంటి అంశాలపై చర్చించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ప్రతి రోజు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతులు మంజూరు చేయాలని కేసీఆర్ కోరే అవకాశం ఉంది. దీనికి తోడు ఏపీతో నెలకొన్న కృష్ణా, గోదావరి జలాల సమస్యపై, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కూడా చర్చించే అవకాశం ఉంది.
ఇతర కేంద్ర మంత్రులను కూడా కేసీఆర్ కలవబోతున్నారు. టీఆర్ఎస్ కార్యాలయానికి భూమిపూజ చేసే అవకాశం ఉందని చెప్పారు. రేపు కూడా ఆయన ఢిల్లీలోనే వుంటారు.