ఇక అందరికీ తిరుమల శ్రీవారి దర్శనం... నిబంధనలు తొలగించిన టీటీడీ
- కరోనా వ్యాప్తి నేపథ్యంలో పిల్లలు, వృద్ధులపై ఆంక్షలు
- ఆంక్షలు తొలగించినట్టు తాజా ప్రకటన చేసిన టీటీడీ
- భక్తుల మనోభావాల రీత్యా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
- వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక క్యూలైన్లు ఉండవని స్పష్టీకరణ
- స్వీయనియంత్రణ, జాగ్రత్త చర్యలతో దర్శనం చేసుకోవాలని సూచన
కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నారులు, వృద్ధులను దర్శనానికి అనుమతించలేదు. తాజాగా శ్రీవారి దర్శనం విషయంలో నిబంధనలు ఎత్తివేసింది. పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్ల లోపు పైబడిన వారికి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. భక్తుల మనోభావాలు, ఆచారాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. స్వీయ నియంత్రణ, జాగ్రత్తలతో దర్శనం చేసుకోవచ్చని వివరించింది. వృద్ధులకు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్ల సౌకర్యంలేదని స్పష్టం చేసింది.