మరో రికార్డు కొట్టిన అల్లు అర్జున్ సినిమా!
- త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో'
- సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్టయిన సినిమా
- డిజిటల్ హక్కులు పొందిన ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్
- ఈ ఏడాది దక్షిణాది చిత్రాల 'టాప్ 10' తొలి స్థానం
మొన్నటి సంక్రాంతికి వచ్చిన 'అల వైకుంఠ పురములో' చిత్రం బాక్సాఫీసు వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలుసు. అల్లు అర్జున్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్ కూడా అయింది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని ప్రతి పాటా సూపర్ హిట్టయింది. అందుకే, యూట్యూబ్ లో ఈ పాటలు వ్యూస్ పొందడంలో కూడా సరికొత్త రికార్డులను సృష్టించాయి.
తాజాగా ఈ 'అల వైకుంఠ పురములో' చిత్రం మరో రికార్డు కూడా సాధించింది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ రేటు ఆఫర్ చేసి అప్పట్లోనే సొంతం చేసుకుంది. ఇక ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ లో వీక్షకులు అత్యధికంగా చూసిన దక్షిణ భారత చిత్రాలలో ఈ చిత్రం మొదటి స్థానంలో నిలిచింది.
ఈ విషయాన్ని వెల్లడిస్తూ నెట్ ఫ్లిక్స్ సంస్థ ఎక్కువమంది చూసిన టాప్ 10 చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఇందులో తొలి స్థానంలో 'అల వైకుంఠపురములో' సినిమా నిలవగా.. ఆ తర్వాతి స్థానాలలో దుల్ఖర్ సల్మాన్ నటించిన తమిళ సినిమా 'కన్నుమ్ కన్నుమ్ కొల్లయిదితాల్' (తెలుగులో కనులు కనులు దోచాయంటే), మలయాళ చిత్రం 'కప్పెలా', సత్యదేవ్ నటించిన తెలుగు చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య' వున్నాయి.