కన్నడ నటి సంజనకు షరతులతో కూడిన బెయిల్
- డ్రగ్స్ కేసులో జైల్లో ఉన్న సంజన
- సంజన బెయిల్ పిటిషన్ ను విచారించిన కర్ణాటక హైకోర్టు
- రూ.3 లక్షలకు వ్యక్తిగత బాండ్, ఇద్దరి ష్యూరిటీతో బెయిల్
- నెలలో రెండుసార్లు పోలీసుల ఎదుట హాజరవ్వాలని షరతు
- సాక్ష్యాలను దెబ్బతీయరాదని స్పష్టీకరణ
ఇటీవల కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రముఖ హీరోయిన్లు సంజన, రాగిణి ద్వివేది అరెస్టయ్యారు. వీరిద్దరూ పలుమార్లు బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా నిరాశే మిగిలింది. అయితే, తాజాగా సంజన బెయిల్ పిటిషన్ పై కర్ణాటక హైకోర్టు సానుకూలంగా స్పందించింది. సంజనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.3 లక్షలకు వ్యక్తిగత బాండ్ సమర్పించాలని, అంతే మొత్తానికి ఇద్దరు వ్యక్తులు సంజనకు ష్యూరిటీ ఇవ్వాలని, హైకోర్టు ఆదేశించింది.
అంతేగాకుండా, నెలలో రెండుసార్లు పోలీసుల ఎదుట హాజరవ్వాలని, విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. ఈ మాదకద్రవ్యాల కేసులో సాక్ష్యాలను దెబ్బతీసేలా వ్యవహరించకూడదని పేర్కొంది. కాగా, ఆరోగ్యపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసినట్టు హైకోర్టు వెల్లడించింది. కాగా, సంజన రేపు ఉదయం లోగా జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్టీల్లో మాదకద్రవ్యాల వినియోగం, డ్రగ్స్ కలిగివుండడం వంటి అభియోగాలతో సంజన, రాగిణిలను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు.